పదిపెళ్లిళ్లు చేసుకున్నాడు... చివరకు ఇలా హతమయ్యాడు... 

పదిపెళ్లిళ్లు చేసుకున్నాడు... చివరకు ఇలా హతమయ్యాడు... 

దేశంలో పెళ్లికానీ ప్రసాదుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంటే, కొందరు మాత్రం ఒకటి రెండు కాకుండా పదుల సంఖ్యలో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.  ఉత్తరప్రదేశ్ లోని బరేలి ప్రాంతానికి చెందిన జగన్ లాల్ యాదవ్ అనే 52 ఏళ్ల రైతు 10 పెళ్లిళ్లు చేసుకున్నాడు.  1990 నుంచి ఇలా పెళ్ళిళ్ళు చేసుకుంటూనే ఉన్నాడు.  పెళ్లి చేసుకున్న 10 మందిలో ఐదుగురు ఇప్పటికే మృతి చెందగా, ముగ్గురు వేరే వారితో లేచిపోయారు.  మిగిలిన ఇద్దరితో కాలం గడుపుతున్నాడు. ఇక్కడ ట్విస్ట్ ఏమంటే పది మందిని పెళ్లి చేసుకున్నా అతగాడికి సంతానం కలగలేదు.  మొదటి భార్య మొదటి భర్తకు పుట్టిన కుమారుడితో కలిసి ఉంటున్నాడు.  వరసగా పెళ్లిళ్లు చేసుకుంటున్నాడని, జగన్ లాల్ తండ్రి తన ఆస్తిని పెద్ద కుమారుడికి రాసిచ్చాడు.  దీనిపై కోర్టుకు వెళ్లిన జగన్ లాల్ కొంత ఆస్తిని రాబట్టుకున్నాడు.  ఆ ఆస్తి విలువ కోట్ల రూపాయల్లో ఉన్నది.  దీనిపై కన్నేసిన కొందరు జగన్ లాల్ ను అతని పొలంలోనే హత్య చేశారు.  ఆస్తికోసం కుటుంబసభ్యులే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.