మంచు మనోజ్ డైవోర్స్

మంచు మనోజ్ డైవోర్స్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో జంట విడిపోయింది.  మంచు కుటుంబం నుంచి హీరోగా వచ్చిన మంచు మనోజ్ కుమార్ ఇండస్ట్రీలో మొదట్లో కొన్ని హిట్ సినిమాలు చేశారు.  అయితే, ఇటీవల కాలంలో మంచు మనోజ్ నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి.  దీంతో హీరో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో తిరిగి మంచి సినిమాలు చేయాలని అనుకుంటున్నారు.  సినిమా ఇండస్ట్రీపైనే ఎక్కువగా దృష్టిపెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు.  

వివాహం చేసుకున్నాక రెండింటిపై దృష్టిపెట్టే క్రమంలో అనేక ఇబ్బందులు పడిన మంచు మనోజ్ పర్సనల్ లైఫ్ విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.  భార్యకు విడాకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. చాలా రోజులుగా వీరి విడాకుల గురించి మీడియాలో వార్తలు వస్తున్నా.. అలాంటిదేమి లేదని గతంలో మంచు మనోజ్ కొట్టిపారేశారు.  అయితే, తాజాగా మంచు మనోజ్ విడాకులు తీసుకుంటున్నట్టు స్వయంగా ప్రకటించడంతో ఈ వివాదానికి తెరపడింది.