విడాకులా...? వాళ్ల బొంద...

విడాకులా...? వాళ్ల బొంద...

తెరపైనే కాదు... తెర వెనుక కూడా జోకులు వేస్తూ... అందరితో సరదాగా ఉంటాడు మంచు మనోజ్... మోహన్ బాబు వారసుడిగా తెరగేట్రం చేసినా... తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ హీరో... సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ఎప్పడికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులకు టచ్‌లో ఉంటూ తన విషయాలు పంచుకోవడంతో పాటు... సినీ ప్రముఖులకు శుభాకాంక్షలు తెలుపుతూ... రిలీజ్ అయ్యే మూవీకి విషెస్ చెబుతూ ఉండే మన మంచువారి హీరో తాజాగా తన ఫ్యాన్స్‌తో ట్విటర్‌లో చాట్‌ చేశారు. ఓ అభిమాని మీరు విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి? అంటూ వేసిన ప్రశ్నకు 'వాళ్ల బొంద' అంటూ సమాధానం ఇచ్చిన మనోజ్... మీ భార్య ప్రణతి గురించి మీ అభిప్రాయమేంటి? అంటూ వేసిన మరో ప్రశ్నకు 'ప్రణతి నా దేవత' అంటూ బదులిచ్చాడు. 

ఇక గత ఏడాది ‘ఒక్కడు మిగిలాడు’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మనోజ్... ఆ తర్వాత ఇప్పటి వరకూ మరో సినిమా ప్రకటించనేలేదు... దీనిపై కూడా అభిమానులు ప్రశ్నించారు. కొత్త సినిమా ఎప్పుడు మొదలుపెడతారు? అన్న ప్రశ్నకు ఆగస్టు‌ చివరిలో..! అని సమాధానం ఇచ్చారు మనోహన్. రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు? అంటూ ప్రశ్న ఎదురుకాగా... 'అప్పుడు!' అంటూ కొంటె సమాధానం ఇచ్చాడు. మరి టాలీవుడ్‌లో వస్తున్న సమస్యలపై మీరు స్పందించడం గౌరవనీయంగా ఉందని అభిమాని అడగగా... 'అది మన బాధ్యత బ్రదర్‌... మనస్ఫూర్తిగా చేస్తున్నా'ను అని పేర్కొన్నాడు. కులం పేరుతో కొందరు రాజకీయ నేతలు మన దేశాన్ని విభజించాలని చూస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయమేంటి? అని ప్రశ్నించగా... 'మన కర్మ. బ్రిటిషర్లు మనకు డివైడ్‌ అండ్‌ రూల్‌ పాలసీని బాగా నేర్పించి వెళ్లారు' అంటూ సమాధానం ఇచ్చాడు మనోజ్... మీరు నటించిన బెస్ట్‌ చిత్రం? అని ఎదురైన ప్రశ్నకు 'ఆ బెస్ట్‌ పెర్‌ఫామెన్స్‌ ఇంకా రావాలి' అని... మంచి ప్రేమకథా చిత్రంలో నటించండి గురూ..! అంటూ అభిమాని వేడుకున్న ప్రశ్నకు 'నేను తర్వాత చేయబోయేది అదే సినిమా'... అంటూ... ఇలా కొంత కొంటెగా... చలాకీగా... సమాధానాలు ఇచ్చారు మనోజ్.