రెండో పెళ్లిపై స్పందించిన మనోజ్

రెండో పెళ్లిపై స్పందించిన మనోజ్

మంచు ఫ్యామిలీలో తనకంటూ ప్రత్యేక ట్రెండ్ సృష్టించుకున్న హీరో మంచు మనోజ్. సినీ కెరీర్ పరంగా పర్వాలేదనిపిచ్చుకున్నా అతడి వైవాహిక జీవితం మాత్రం సవ్యంగా సాగలేదు. మనోజ్ ప్రేమించిన అమ్మాయినే పెద్దల అంగీకారంతో 2016 లో వివాహం చేసుకున్నారు. పెళ్లి అయిన మూడు సంవత్సారాలకే వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో 2019లో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత మనోజ్ కొంతకాలం పాటు డిప్రెషన్‌కు గురయినట్లు కూడా కథనాలు వచ్చాయి. ఈ మధ్య బాధ నుంచి తేరుకున్న మనోజ్ ‘అహం బ్రహ్మాస్మి’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ సగం వరకు పూర్తి అయింది. అయితే తాజాగా మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వాటిపై మనోజ్ స్పందించారు. కాకపోతే ఘాటైన మాటలు కాకుండా చమత్కారంగా సమాధానం ఇచ్చారు. ఇటీవల విడుదల అయిన జాతి రత్నాలు ట్రైలర్‌లోని బ్రహ్మానందం ఫోటోలను తీసుకొని ప్లేస్, డేట్ కూడా మీరే వేయండి అంటూ కొన్ని ఎమోజీలను జోడించారు. ఇది చూసిన వారికి మనోజ్ తన రెండో పెళ్లి వార్తను ఖండిస్తున్నారా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. మరి ఈ విషయంలో త్వరలోనే మరింత క్లారిటీ వస్తుందేమో వేచి చూడాలి.