మా నాన్న డబ్బుని వాడుకోను - మనోజ్

మా నాన్న డబ్బుని వాడుకోను - మనోజ్

ఏ విషయాన్నైనా సరే కుండబద్దలు కొట్టినట్టు చెప్పడంలో హీరో మంచు మనోజ్ ముందుంటారు.  సొసైటీలో జరిగే విషయాలపై, తన విషయాలపై నిక్కచ్చిగా మాట్లాడతారాయన.  తాజాగా ట్విట్టర్లో ఒక నెటిజన్ మంచు మనోజ్ పని చేయకుండా తన నాన్న డబ్బుని వాడుకొని తెగ ఎంజాయ్ చేస్తుంటాడు.  లైఫ్ అంటే నీదే.. యువతకు నువ్వే స్ఫూర్తి అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. 

ఆ కామెంట్లకు మనోజ్ ఆవేశపడిపోకుండా 'మా నాన్న డబ్బుని నేను వాడుకుంటే ఆయన చాలా సంతోషిస్తారు.  కానీ నేను అలా చేయను.  నెక్స్ట్ సినిమా సైన్ చేయడానికి ఇంకా టైమ్ తీసుకుంటాను.  కాలేజ్ రోజుల్లో హోటల్లో గా పనిచేవాడిని.  నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడం కోసం ఎప్పుడూ కొత్త దర్శకులతో పనిచేస్తాను' అంటూ నెమ్మదిగా సమాధానమిచ్చారు.