సహృదయాన్ని చాటుకున్న మంచు హీరోలు !

సహృదయాన్ని చాటుకున్న మంచు హీరోలు !

హీరో మంచు మనోజ్ సిరిసిల్లకు చెందిన అశ్విత అనే విద్యార్థిని దత్తతు తీసుకుని తమ విద్యానికేతన్ విద్యాసంస్థల ద్వారా ఆమెకు పూర్తి విద్యను అందించి ఐఏఎస్ అవ్వాలనే ఆమె కలకు తోడ్పాటును అందిస్తున్న సంగతి తెలిసిందే.  మంచు విష్ణు సైతం ఈరోజు తండ్రి మోహన్ బాబు పుట్టిన రోజు సందర్బంగా ఒక మంచి పనికి పూనుకున్నారు.  తిరుపతి రుయా ఆసుపత్రిలోని ఐసీయు విభాగాన్ని కోటి రూపాయలతో మెరుగుపరుస్తామని అన్నారు.  అలాగే ఎమెర్జెన్సీ, అవుట్ పేషేంట్ విభాగాన్ని కూడా నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు.  ఇలా సోదరులిద్దరూ ఒకేసారి సామాజిక కార్యక్రమాలకు పూనుకోవడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.