ఇది శ్రీరామ పట్టాభిషేకం..!

ఇది శ్రీరామ పట్టాభిషేకం..!

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్ విజయాన్ని నేను ఊహించిందే అన్నారు సినీనటుడు మంచు మోహన్ బాబు.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నేను 130 సీట్లే వస్తాయని అనుకున్నాను.. కానీ, అంతకు మించి 151 సీట్లు సాధించిన వైఎస్ జగన్‌కు శుభాకంక్షలు అని తెలిపారు. శ్రీరాముడు పట్టాభిషేకానికి ఎలా కష్టపడాల్సి వచ్చిందో... అలా జగన్‌ ఎన్నో కష్టాలు ఎదుర్కొని.. పట్టాభిషేకానికి సిద్ధమయ్యారని అభివర్ణించారు.  జగన్ ప్రజలకు రాజన్న పాలనను అందిస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేసిన మోహన్‌బాబు... సుదీర్ఘమైన కాలం పాటు జగన్ పరిపాలనా అందిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇక చంద్రగిరిలో కులాల పేరుతో కొట్టుకోవడం బాధ కలిగించిందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన ప్రధాని నరేంద్ర మోడీ, వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపిన మోహన్ బాబు... జగన్ గెలుపు నా పెద్దరాయుడు సినిమా విజయం లాంటిందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తాను కార్యకర్తను మాత్రమే అన్నారు మోహన్ బాబు.