టీటీడీ చైర్మన్‌ రేసుపై మోహన్‌బాబు క్లారిటీ..

టీటీడీ చైర్మన్‌ రేసుపై మోహన్‌బాబు క్లారిటీ..

ఓవైపు టీటీడీ పాలకమండలి చైర్మన్, బోర్డు సభ్యులు రాజీనామా చేసేందుకు అంగీకరించడంలేదు.. మరోవైపు ఆర్డినెన్స్ తెచ్చి పాలకమండళ్లను రద్దుచేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇక తాను టీడీపీ చైర్మన్ రేసులో లేనని ప్రముఖ సినీనటుడు, వైసీపీ నేత మంచు మోహన్ బాబు స్పష్టం చేశారు. టీటీడీ చైర్మన్‌ పోస్ట్ మంచు మోహన్‌బాబును వరించబోతోందంటూ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్‌గా మారిపోయింది. దీనిపై సోషల్ మీడియా వేదికగానే స్పందించిన మోహన్ బాబు.. ''నేను టీటీడీ చైర్మన్ రేసులో ఉన్నట్టుగా కొద్దిరోజులుగా వార్తలు వ‌స్తున్నాయి. కొంద‌రు ఫోన్లు కూడా చేసి అడుగుతున్నారు. నా ఆశ‌యం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడ‌డ‌మే. అందుకోసమే నా వంతుగా క‌ష్టపడ్డాను. వైఎస్ జ‌గ‌న్ ప్రజ‌ల ముఖ్యమంత్రి అవుతాడ‌న్న న‌మ్మకంతోనే నేను తిరిగి రాజ‌కీయాల్లోకి వచ్చా.. అంతేగాని ఎలాంటి ప‌ద‌వులూ ఆశించి కాదు. ఇలాంటి పుకార్లను ప్రోత్సహించ‌వ‌ద్దని మీడియాను కోరుతున్నాను'' అంటూ ట్వీట్ చేశారు మోహన్ బాబు.