అమిత్‌షాతో ముగిసిన భేటీ.. మోహన్‌బాబు ఏమన్నారంటే..?

అమిత్‌షాతో ముగిసిన భేటీ.. మోహన్‌బాబు ఏమన్నారంటే..?

ఢిల్లీ పర్యటనలో ఉన్న సినీ నటుడు మంచు మోహన్ బాబు... తన కుటుంబసభ్యులతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీని కలవగా... కాసేపటి క్రితం కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ  చీఫ్ అమిత్‌షాతో భేటీ అయ్యారు. మోహన్‌బాబు వెంట విష్ణు, విరోనికా, లక్ష్మీప్రసన్న కూడా ఉన్నారు.. ఇక, ఆయన మరికొందరు కేంద్ర మంత్రులను, బీజేపీ నేతలను కలుస్తారనే చర్చ సాగుతోంది. అయితే, ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే గుసగుసలు కూడా మరోవైపు వినిపిస్తున్నాయి. ఇక, షాను కలిసిన తర్వాతా మీడియాతో మాట్లాడిన మోహన్ బాబు.. ప్రధాని, కేంద్రహోంమంత్రిశాఖ మంత్రిపై ప్రసంశల వర్షం కురిపించారు. దేశాన్ని గొప్ప స్థానంలో నిలిపిన వ్యక్తి నరేంద్ర మోడీ అయితే.. హోంమంత్రి పదవికే వన్నె తెచ్చిన వ్యక్తి అమిత్ షా అని ప్రసంశించారు. అయితే, తన పర్యటనకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని.. వివరాలకు చెప్పకుండా దాటవేసిన మోహన్ బాబు.. ప్రధాని మోడీ ఆప్యాయంగా పలకరించడం, ప్రేమగా మాట్లాడటం కంటే ఏం కావాలి? అని వ్యాఖ్యానించారు. ఇక, మోహన్ బాబు ఫ్యామిలీ మొత్తం బీజేపీలో చేరతారనే ప్రచారం నేపథ్యంలో దీనిపై స్పందించిన మోహన్ బాబు... బీజేపీలోకి ఆహ్వానించారన్న దానిపై ఇప్పడేమీ చెప్పనన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంచి పాలన అందిస్తున్నారని ప్రశంసించిన మోహన్‌బాబు.. సీఎం వైఎస్ జగన్‌ను కాదని తాము ఢిల్లీకి రాలేదని క్లారిటీ ఇచ్చారు.