వచ్చిన వారే మా మిత్రులు: మందకృష్ణ

వచ్చిన వారే మా మిత్రులు: మందకృష్ణ

ఈ నెల 19న అమరావతిలో తలపెట్టిన విశ్వరూప మహాసభకు అన్ని రాజకీయ పార్టీల పెద్దలకు ఆహ్వానం ఉంది. వచ్చిన వారు మా మిత్రులు అవుతారు.. రాని వారు మా మిత్రులు కాదని ఎమ్మార్పీయెస్ వ్యవస్థాపక నేత మంద కృష్ణ మాదిగ అన్నారు. నేడు అయన కృష్ణా జిల్లాలో మాట్లాడుతూ... ఈ నెల 19వ తేదిన విశ్వరూప మహాసభకు మాదిగలందరు భారిగా తరలిరావాలని కోరారు. ప్రత్యేక హోదా ఆంధ్ర ప్రజల హక్కు, ఎమ్మార్పీయెస్ ప్రత్యేక హోదా కోసం కట్టుబడి ఉందన్నారు. మా జాతికి ఎవరు రాజకీయ ప్రాతినిధ్యం, సంక్షేమం కల్పిస్తారో..  వేదికపైకి ఎవరు వస్తారో, ఎవరు రారో తెలుపుతుందని.. మా రాజకీయ నిర్ణయం ఆరోజు తెలుస్తుందని మంద కృష్ణ తెలిపారు.