కోడలు, భార్యకు ఆస్తులు బహుమతిగా ఇస్తే పన్నులా?

కోడలు, భార్యకు ఆస్తులు బహుమతిగా ఇస్తే పన్నులా?

ప్రస్తుతమున్న ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ చట్టంలో మార్పులు తేవాలని కేంద్ర మంత్రి మేనకా గాంధీ డిమాండ్‌ చేశారు. భార్యకు లేదా కోడలికి ఆస్తులను బహుమతిగా ఇస్తే... వాటిని ఆదాయపు పన్ను నుంచి  మినహాయించాలని ఆమె కోరారు. ఈ మేరకు ఆమె కేంద్ర ఆర్థికశాఖ లేఖ రాశారు.  ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ చట్టంలోని సెక్షన్‌ 64ను సవరించాలని కోరారు. ఈ సెక్షన్‌ ప్రకారం ఒక వ్యక్తి భార్య లేదా కోడలికి ఆస్తులను బహుమతిగా ఇస్తే.. సదరు ఆస్తుల నుంచి ఏదైనా ఆదాయం వస్తే... బహుమతిగా ఇచ్చిన వ్యక్తి సదరు ఆదాయంపై పన్ను కట్టాల్సి ఉంటుంది. దీనివల్ల మామ లేదా భర్త ... తమ భార్య లేదా కోడలికి ఆస్తులను బహమతిగా ఇవ్వడానికి ఇష్టపడటం లేదని మేనకా గాంధీ అన్నారు. మున్ముందు ఇవి తమకు ఆర్థిక భారంగా మారుతాయని వారు భయపడటమే కారణమని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు.  భార్య లేదా కోడలికి స్వతంత్రంగా పన్ను చెల్లించే  ఆదాయం  ఏదీ ఉండదని భావించి.. 1960 పడిలో ఐటీ చట్టంలో సెక్షన్‌ 64ను ప్రవేశపెట్టారని, ఇపుడు దాన్ని రద్దు చేయాలని ఆమె డిమాండ్‌ చేస్తున్నారు.