అక్కడ అపార్టుమెంట్లు, స్థలాలు కొనొద్దు..!

అక్కడ అపార్టుమెంట్లు, స్థలాలు కొనొద్దు..!

ప్రజలకు కీలక సూచలను చేశారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి... ప్రజలేవరూ... మంగళగిరి నియోజకవర్గంలో నిర్దిష్ట సమాచారం లేకుండా అపార్టుమెంట్లు కానీ, స్థలాలు కానీ కొనొద్దన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో లింగమనేని అక్రమాలు ఎన్ని చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేసిన ఆర్కే... అక్రమంగా లే ఔట్లు వేసి వెంచర్లు చేశారు.. నిబంధనలను పాటించలేదు, సుమారు 40 ఎకరాల్లో అక్రమంగా లేఔట్లు చేశారని మండిపడ్డారు. విలాసవంతమైన విల్లాలు కట్టి ఒక్కోదాన్ని రూ. 5 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించిన వైసీపీ ఎమ్మెల్యే... బిల్డింగ్ పర్మిట్, లే ఔట్ ఫీజు.. కాజా గ్రామానికి కట్టాల్సిఉన్నా ఇప్పటిదాకా కట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ విలువ గజానికి రూ. 4 వేలుగా చూపించారని.. సుమారు రూ. 40-50 కోట్లు పంచాయితీకి రావాల్సిన ఫీజు ఎగ్గొట్టారని... అంతేకాకుండా పంచాయితీ మీదే కేస్ వేశారు, ఆ కేసులను బెంచ్ పైకి రాకుండా మేనేజ్ చేశారని ఆరోపించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి విజిలెన్స్ దర్యాప్తు కొరతామని తెలిపారు ఆర్కే. 

కరకట్టపై ఉన్న ఇల్లు ఇచ్చారు కాబట్టే చంద్రబాబు ఏమి మాట్లాడకుండా ఉండిపోయారని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్కే ఆర్కే... సామాన్యులు అప్పులు తెచ్చుకుని కొనుక్కుని, తరువాత ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. గత 5 సంవత్సరాల్లో జరిగిన భూ బాగోతాలపై దర్యాప్తు జరగాలని ముఖ్యమంత్రిని కొరతామని వెల్లడించిన ఆయన.. మంగళగిరి నియోజకవర్గంలో నిర్దిష్ట సమాచారం లేకుండా ఏమీ కొనద్దన్నారు. విజయవాడ క్లబ్ కూడా అక్రమ కట్టడమే, అనుమతి లేని ఏ భవనానికైనా సీఆర్డీఏ నోటీసులు ఇస్తుందని అనుకుంటున్నామన్నారు. ప్రస్తుతం చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ కూడా ప్రభుత్వానిదేనని లింగమనేని చెప్పారని... చంద్రబాబు కూడా ఆ విషయాన్ని చెప్పారన్నారు ఆర్కే.