మణి స్కూల్ నుంచి మల్టీస్టారర్..!!

మణి స్కూల్ నుంచి మల్టీస్టారర్..!!

నాయకుడు, గీతాంజలి, దళపతి, రోజా, బొంబాయి  ఈ పేర్లు వినగానే గుర్తుకు వచ్చే పేరు మణిరత్నం.  సామాజిక అంశాలను, సమాజంపై ప్రభావం చూపించిన చెడు అంశాలను తన కథలో అందంగా చూపించడంలో మణిరత్నం సిద్ధహస్తుడు. ఆయన దర్శకత్వంలో ఒక్కసారైనా నటించాలని సినిమా హీరోలకు ఉంటుంది. సౌత్, నార్త్ అనే భేదం లేదు.  అన్ని చోట్ల ఆయన సినిమాలకు భారీ డిమాండ్ ఉంటుంది.  

మణిరత్నం స్కూల్ నుంచి ఎంట్రీ ఇచ్చారు.  కొత్త కొత్త దర్శకులను ఇంట్రడ్యూస్ చేశారు.  ఇప్పుడు మణిరత్నం స్కూల్ నుంచి మరో దర్శకుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.  మద్రాస్ టాకీస్ బ్యానర్లో మణిరత్నం ఓ మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నాడు.  విక్రమ్ ప్రభు, జీవి ప్రకాష్ కుమార్, మడోన్నా సెబాస్టియన్, ఐశ్వర్య రాజేష్ లు హీరోహీరోయిన్లు.  మణిరత్నం దగ్గర అసిస్టెంట్ గా చేసిన ధన శేఖర్ ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు.  అలాగే 96 సినిమాకు వయలిన్ మ్యూజిక్ కు అందించిన గోవింద్ వసంతను మ్యూజిక్ డైరెక్టర్ గా ఈ సినిమా ద్వారా పరిచయం కాబోతున్నాడు.  కొత్తవాళ్లను, యువతరాన్ని ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతోనే మణిరత్నం ఉన్నట్టు తెలుస్తోంది.