రివ్యూ: మణికర్ణిక

రివ్యూ: మణికర్ణిక

నటీనటులు: కంగనా రనౌత్‌, అంకితా లోఖండే, అతుల్‌ కులకర్ణి, జిషు సేన్‌గుప్తా, సురేశ్‌ ఒబేరాయ్‌, డానీ డెంగోజాపా

మ్యూజిక్: శంకర్‌-ఇసాన్‌-లాయ్‌

ఫోటోగ్రఫి: కిరణ్‌ డియోహన్స్‌, జ్ఞానశేఖర్‌. వి.ఎస్‌

నిర్మాణం: జీ స్టూడియోస్‌, కమల్‌ జైన్‌, నిశాంత్‌ పిట్టి

దర్శకత్వం: క్రిష్‌ జాగర్లమూడి, కంగనా రనౌత్‌

 

బాలీవుడ్ లో బయోపిక్ ల హవా నడుస్తోంది.  వరసగా బయోపిక్ సినిమాలు వస్తున్నాయి.  ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్ర ఆధారంగా క్రిష్, కంగనా దర్శకత్వంలో మణికర్ణిక సినిమా తెరకెక్కింది.  ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది.  మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో తెలుసుకుందామా. 

కథ: 

బెనారస్ లోని బితూర్ లో జన్మించిన మణికర్ణికా, ఝాన్సీ రాజ్యానికి చక్రవర్తిగా ఉన్న గంగాధర్ ను వివాహం చేసుకుంటుంది.  ఝాన్సీ రాజ్యానికి వెళ్ళాక అక్కడి ప్రజలతో మమేకం అయ్యి మంచి పేరు తెచ్చుకొని లక్ష్మీబాయిగా మారుతుంది.  ఇదే సమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీ దేశంలో విస్తరిస్తుంది.  ఝాన్సీ రాజ్యాన్ని కైవసం చేసుకోవడానికి బ్రిటిష్ పాలకులు ప్రయత్నాలు చేస్తారు.  బ్రిటిష్ పాలకులను ఎలా ఎదిరించింది..? ఝాన్సీ కోసం లక్ష్మీబాయి ఎలా పోరాటం చేసింది అన్నది మిగతా కథ.  

విశ్లేషణ: 

మణికర్ణిక చిన్నతనంలో జరిగిన విషయాలను చూపిస్తూ సినిమా ఓపెన్ అవుతుంది.  మణికర్ణిక చిన్ననాటి నుంచే ధైర్యసాహసాలు ఉన్న బాలిక.  సాహస కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండేది.  విల్లు, కత్తి యుద్ధం నేర్చుకుంటుంది. పెద్దయ్యాక, మణికర్ణిక, ఝాన్సీ రాజ్యానికి చక్రవర్తిగా ఉన్న గంగాధర్ ను వివాహం చేసుకుంటుంది.  వివాహం తరువాత జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి అనే విషయాలను ఫస్ట్ హాఫ్ లో చూపించారు.  విజువల్స్ పరంగా ఫస్ట్ హాఫ్ బాగుంది.  

కథ అంతా సెకండ్ హాఫ్ లో మొదలౌతుంది.  సెకండ్ హాఫ్ లో ఝాన్సీ ని కైవసం చేసుకోవడానికి బ్రిటిష్ సైనికులు ఎలాంటి ఎత్తులు వేశారు.  వారిని ఎదుర్కొనానికి ఝాన్సీ లక్ష్మీభాయ్ ఎలా పోరాటం చేసిందనే విషయాలను చక్కగా చూపించారు.  తెలిసిన కథే అయినప్పటికీ ఝాన్సీ కుటుంబం అంతర్గతంగా ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి, మీరట్ సిపాయి తిరుగుబాటు గురించి ఈ సినిమాలో చూపించారు.  సినిమా మొత్తం చాలా ఆసక్తిగా సాగింది.  విజువల్స్ పరంగా సినిమా సూపర్బ్ గా ఉంది. ముఖ్యంగా పోరాట సన్నివేశాలను నిజంగా జరుగుతున్నాయా అనిపించే విధంగా షూట్ చేశారు.  

నటీనటుల పనితీరు: 

ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో కంగనా రనౌత్ అద్భుతంగా నటించింది.  యవ్వనంలో ఉన్నప్పుడు ఆనందంగా గడపడం, కత్తి పట్టి కదనరంగంలోకి దిగినప్పుడు ఆమె చూపించిన రౌద్రం అద్భుతంగా ఉన్నాయి.  కంగనా కెరీర్లో ఈ సినిమా మరోమైలురాయి.  లక్ష్మీబాయి భర్తగా జిషు సేన్ గుప్తా ఒదిగిపోయి నటించాడు.  మిగతా నటీనటులు వారి పరిమితి మేరకు నటించి మెప్పించారు. 

సాంకేతిక వర్గం పనితీరు: 

కంగనా రనౌత్ సినిమాను హ్యాండిల్ చేసిన తీరు అద్భుతం.  ఒకవైపు నటిస్తూనే మరోవైపు ఇలాంటి కథను డీల్ చేయడం అంటే సాహసమే అని చెప్పాలి.  ఫొటోగ్రఫీ ఆకట్టుకుంది.  బ్యాక్ గ్రౌండ్ సంగీతం సూపర్బ్ గా ఉంది.  

పాజిటివ్ పాయింట్స్: 

కథ 

కంగనా రనౌత్ 

దర్శకత్వం 

విజువల్స్ 

మైనస్అ పాయింట్స్: 

అక్కడక్కడా అనవసరమైన సన్నివేశాలు 

చివరిగా: మణికర్ణిక.. ఓ మహిళా వీరోచిత గాథ