హాస్పిటల్ లో మణిరత్నం..

హాస్పిటల్ లో మణిరత్నం..

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కొద్దిసేపటి క్రితం అపోలో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు.  ఆయనకు సడెన్ గా గుండెపోటు రావడంతో హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు.  ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు.  మణిరత్నంకు  ఇలా గుండెనొప్పి రావడం ఇది మూడోసారి.  గతంలో 2004 వ సంవత్సరంలో యువ సినిమా సమయంలో గుండెపోటుకు గురయ్యారు.  2015 వ సంవత్సరంలో రెండోసారి హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు.  

2018 మరోమారు గుండెపోటుతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు.  అయితే, రెగ్యులర్ చెకప్ లో భాగంగానే హాస్పిటల్ లో జాయిన్ అయ్యారని సమాచారం.  ఇప్పుడు మరోమారు గుండెపోటు రావడంతో ఆయన్ను హుటాహుటిన హాస్పిటల్ లో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారు.