ఆ స్టార్ హీరోలతో మణిరత్నం సినిమా లేదు !

ఆ స్టార్ హీరోలతో మణిరత్నం సినిమా లేదు !

చాన్నాళ్ల తర్వాత సీనియర్ డైరెక్టర్ మణిరత్నం 'నవాబ్' సినిమాతో హిట్ అందుకున్నారు.  దీంతో ఆయన తరవాత సినిమాపై రకరకాల రూమర్లు బయలుదేరాయి.  ఆయన నెక్స్ట్ సినిమాను స్టార్ హీరోలు విజయ్, విక్రమ్, శింబులతో కలిసి చేస్తున్నారని అన్నారు. 

కానీ అలాంటిదేం లేదని, ఈ ప్రాజెక్ట్ రూమర్లకు మాత్రమే పరిమితమని, అసలు విజయ్ 2019 మార్చి వరకు ఏ కొత్త సినిమాకు సైన్ చేయరని తెలిసింది.  దీంతో అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఈ భారీ మల్టీస్టారర్ ఊహలు చెదిరిపోయాయి.