బాహుబలిని మించే ప్రాజెక్ట్ రెడీ అవుతుందా..?

బాహుబలిని మించే ప్రాజెక్ట్ రెడీ అవుతుందా..?

రీజినల్ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి.  ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమా రెండు భాగాలుగా రిలీజ్ అయింది.  ఈ రెండు సూపర్ హిట్టయ్యాయి.  దాదాపుగా రూ.2000 కోట్ల రూపాయలు వసూలు చేసింది.  ఈ సినిమాను మించే సినిమాను తీయడం కోసం అనేకమంది ప్రయత్నం చేస్తున్నారు.  

ఇలా ప్రయత్నిస్తున్న దర్శకుడిలో ఒకరు మణిరత్నం.  నవాబ్ సినిమాతో మణి ఈజ్ బ్యాక్ అనిపించుకున్న ఈ దళపతి ఓ భారీ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టాడు.  తమిళంలో ప్రసిద్ధ రచయితా కల్కి కృష్ణమూర్తి రచించిన గ్రంధం ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధం అవుతున్నాడు.  ఈ గ్రంధం ఐదు భాగాలుగా ఉంటుంది.  ఈ మొత్తాన్ని ఒకే సినిమాగా కాకుండా మూడు భాగాలుగా తెరకెక్కించాలని చూస్తున్నాడు.  ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయని సమాచారం.  

ఇందులో హీరోయిన్ గా ఐశ్వర్యారాయ్ ను అనుకుంటున్నారట.  ఆమెను సంప్రదించి ఇప్పటికే కథను చెప్పినట్టుగా తెలుస్తోంది.  బిగ్ బి అమితాబ్ ఇందులో కీలక రోల్ చేసేందుకు ఓకే చెప్పారని తెలుస్తోంది.  కోలీవుడ్, టాలీవుడ్ కు చెందిన కొంతమంది టాప్ స్టార్స్ ఇందులో నటిస్తారని తెలుస్తోంది. సంక్రాంతి రోజున ఈ సినిమాకు సంబంధించిన కీలక ప్రకటన చేయబోతున్నారని తెలుస్తోంది.