రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న మణిరత్నం 'నవాబ్' !

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న మణిరత్నం 'నవాబ్' !

పాపులర్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'నవాబ్'.  స్టార్ నటులు శింబు, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్, అరవింద స్వామిలు కలిసి నటిస్తున్న ఈ సినిమాపై దక్షిణాది ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.  గడువు కంటే ముందుగానే అన్ని పనులు పూర్తవడంతో సినిమాను అనుకున్న తేదీ కంటే ఒకరోజు ముందు సెప్టెంబర్ 27న సినిమాను రిలీజ్ చేస్తున్నారు. 

తమిళంతో పాటు తెలుగులో కూడ ఒకేసారి విడుదలకానుంది ఈ సినిమా.  టీజర్, ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ సినిమాలో జ్యోతిక, అదితిరావ్ హైదరి, జయసుధలు నటిస్తుండగా ఆస్కార్ విజేత ఏ.ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.