మణిరత్నంను నవాబ్ నిలబడుతుందా..?

మణిరత్నంను నవాబ్ నిలబడుతుందా..?

నవాబ్ ట్రైలర్స్ ను చూస్తుంటే మణిరత్నం ఈజ్ బ్యాక్ అనే విధంగా ఉన్నాయి.  అప్పుడెప్పుడో వచ్చిన నాయకుడు, దళపతి సినిమాలను గుర్తుకు తెస్తున్నది.  నవాబ్ లో ఒకరు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు స్టార్స్ ఉన్నారు.  నాలుగు వారసుల మధ్య జరిగే పోరుకు సంబంధించిన సినిమా ఇది.  ట్రైలర్స్ ఆకట్టుకోవడంతో.. సినిమాపై ఆసక్తి పెరిగింది.  మణిరత్నం ఓకే బంగారం హిట్టయినా ఆ తరువాత వచ్చిన చెలియా సినిమా పరాజయం పాలవ్వడంతో ఈ సినిమాపై మొదట్లో నీలిమేఘాలు కమ్ముకున్నాయి. 

కానీ, లైకా ప్రొడక్షన్స్ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని సినిమాను నిర్మించింది.  అందుకు తగ్గట్టుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది.  దాదాపు రూ.55 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది.  ప్రపంచ వ్యాప్తంగా 800 స్క్రీన్స్ లో సినిమా రిలీజ్ అవుతున్నది.  మరి ఈ సినిమా ఎలా ఉంటుందో ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో తెలియాలంటే మరి కొద్దీ గంటలు ఆగాల్సిందే..