800మీ.ల పరుగులో భారత్ హవా

800మీ.ల పరుగులో భారత్ హవా

ఆసియా క్రీడల్లో భారత్ కి 9వ స్వర్ణపతకం వచ్చింది. 800 మీటర్ల పరుగులో భారత క్రీడాకారుడు మంజీత్ సింగ్ స్వర్ణం సాధించాడు. ఇదే పోటీలో భారత్‌కు చెందిన మరో స్ప్రింటర్ జిన్స్ జాన్సన్ రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని దక్కించుకున్నాడు. మంజీత్ సింగ్ 1.46:15 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు. జాన్సన్ 1.46:35 సెకన్లలో గమ్యాన్ని చేరుకున్నాడు. దీంతో స్వర్ణ, రజత పతకాలు రెండూ భారత్ ఖాతాలో పడ్డాయి.