మరోసారి అభిమానుల ఆగ్రహానికి గురవుతున్న మంజ్రేకర్...

మరోసారి అభిమానుల ఆగ్రహానికి గురవుతున్న మంజ్రేకర్...

భారత మాజీ క్రికెటర్, వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ మరోసారి అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. అయితే గత సంవత్సరం జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను అవమానిస్తూ వ్యాఖ్యానించాడు మంజ్రేకర్. దాంతో బీసీసీఐ ఈ ఏడాది మార్చి లో తమ కామెంట్రీ ఫ్యానల్ నుంచి మంజ్రేకర్ ను తొలగించింది. అందువల్ల అతను భారత మ్యాచ్ లకు మాత్రమే కాకుండా ఐపీఎల్ కూడా కామెంట్రీ చెప్పే అవకాశాన్ని కోల్పోయాడు. దాంతో బీసీసీఐకి క్షమాపణ కోరుతూ లేఖ రాసాడు మంజ్రేకర్. అందులో ఇక నుండి ఎవరిని అవమానించే విధంగా కామెంట్రీ  చేయకుండా బుద్ధిగా ఉంటాను అని తెలిపాడు. అయిన కూడా అతనికి ఐపీఎల్ కామెంట్రీ ఫ్యానల్‌లో చోటు దక్కలేదు.

ఇక నిన్న ఐపీఎల్ 2020 ప్రారంభమైంది. మొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగింది. అందులో చెన్నై బ్యాట్స్మెన్ అంబటి రాయుడు 71 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక అంతకముందు బౌలింగ్ లో పీయూష్ చావ్లా ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ తీసి తర్వాత కట్టుదిట్టమైన బంతులు విసిరాడు. అయితే ఈ మ్యాచ్ తర్వాత చెన్నై జట్టును ట్విట్టర్ వేదికగా మంజ్రేకర్ అభినందిస్తూ ... తక్కువ ప్రొఫైల్ ఉన్న ఇద్దరు క్రికెటర్లు చావ్లా, రాయుడు అద్భుతంగా ఆడటం ఆనదంగా ఉంది అంటూ ట్విట్ చేసాడు. ఇక అంతర్జాతీయ ఆటగాళ్లను తక్కువ ప్రొఫైల్ ఉన్న వారు అంటూ ట్విట్ చేయడంతో ఆగ్రహానికి గురైన అభిమానులు మంజ్రేకర్ ను ట్రోల్ చేయడం ప్రారంభించారు.