ఆ మన్మథుడు.. ఈ మన్మథుడు వేరు వేరు

ఆ మన్మథుడు.. ఈ మన్మథుడు వేరు వేరు

నాగార్జున 'మన్మథుడు 2' టీజర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది.  టీజర్ చూస్తుంటే ఇది 2002లో వచ్చిన 'మన్మథుడు' సినిమాకి పూర్తి విరుద్దంగా ఉన్నట్టుంది.  ఆ అప్పటి మన్మథుడు అమ్మాయిని శ్రద్దగా ప్రేమించి, మోసపోయాననుకుని పెళ్లి వద్దంటే ఈనాటి మన్మథుడు మాత్రం  నేను ప్రేమలో పడనని, కేవలం ప్రేమిస్తానని మాత్రమే అంటున్నాడు.  అంటే రెండు పాత్రలకి చాలా తేడా ఉంటుంది.  అప్పటి మన్మథుడు అమాయకుడైతే ఈ మన్మథుడు చిలిపి కృష్ణుడన్నమాట.  రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగష్టు 9న రిలీజ్ కానుంది.