రకుల్ ఏ సర్టిఫికెట్ చూపిస్తుందట..!!

రకుల్ ఏ సర్టిఫికెట్ చూపిస్తుందట..!!

రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా చేస్తున్న మన్మధుడు 2 సినిమా టీజర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు.  టీజర్ ఓపెనింగ్ లో పద్దతిగల అమ్మాయిగా కనిపిస్తుంది.  అవంతిక పేరుకు తగ్గట్టుగా క్లాస్ గా చీరకట్టుకొని ఏమి తెలియనట్టు కనిస్తుంది.  ఆ తరువాతే అసలు రంగు బయటపెడుతోంది రకుల్.  నాగార్జునను టీజ్ చేస్తూ ఆటపెట్టిస్తుంది.  

అక్కడితో ఆగకుండా నాగార్జునకు అదిరిపోయే హింట్ ఇస్తున్నది.  ఇప్పటి వరకు యు సర్టిఫికెట్ మాత్రమే చూపించారు.  ఇకపై ఏ సర్టిఫికెట్ చూపిస్తా అని చెప్పడంతో నాగ్ షాక్ అవుతాడు.  సిగరెట్ తాగుతూ అందరి మతులు పోగొడుతుంది అల్లరిపిల్ల రకుల్.  ఫస్ట్ టీజర్ లో నాగ్ చీకట్లో చేసే శృంగారాల గురించి చూపించారు.  అందులో రకుల్ ను చూపించలేదు.  ఇప్పుడు సెకండ్ టీజర్ లో రకుల్ గురించి చూపిస్తూ.. ఆమె వెనుక దాగున్న రహస్యాన్ని బట్టబయలు చేశారు. రెండు టీజర్లో ఇద్దరు ఇద్దరే అనిపించారు.  మరి సినిమా ఇంకెంత రచ్చ చేస్తుందో చూడాలి.