పోర్చుగల్ షెడ్యూల్ ముగించిన నాగార్జున !

పోర్చుగల్ షెడ్యూల్ ముగించిన నాగార్జున !

 

నాగార్జున అక్కినేని ప్రస్తుతం తన సూపర్ హిట్ చిత్రం 'మన్మథుడు'కు సీక్వెల్ 'మన్మథుడు2' చేస్తున్న సంగతి తెలిసిందే.  కథ ప్రకారం సినిమా కొంత భాగం పోర్చుగల్ దేశంలో జరుగుతుందట.  అందుకే టీమ్ నెల క్రితం పోర్చుగల్ వెళ్లారు.  ఆ షెడ్యూల్ నేటితో పూర్తయింది.  తరవాతి షెడ్యూల్ హైదరాబాద్లో మే 21వ తేదీ నుండి మొదలుకానుంది.  రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయకిగా నటిస్తోంది.