మన్మధుడు 2 కి ముహూర్తం కుదిరిందా..?

మన్మధుడు 2 కి  ముహూర్తం కుదిరిందా..?

నానితో మల్టీస్టారర్ సినిమా చేసిన తరువాత నాగార్జున మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.  బాలీవుడ్ లో ధర్మ ప్రొడక్షన్స్ లో బ్రహ్మాస్త్ర సినిమా చేస్తున్న నాగార్జున, ఇటు తమిళంలో ధనుష్ తో మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్నారు.  ఈ రెండు సినిమాలు మినహా మరే సినిమాకు నాగార్జున కమిట్ కాలేదు.  

ఎప్పటినుంచో నాగార్జున మన్మధుడు సినిమాకు సీక్వెల్  చేస్తారని వార్తలు వచ్చాయి.  చిలసౌ వంటి ఓ మంచి తెలుగు చిత్రాన్ని అందించిన రాహుల్ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందని మీడియాలో కథనాలు వచ్చాయి.  నాగార్జునకు రాహుల్ కథ వినిపించారని, కానీ, కథ విషయంలో నాగార్జున అంతగా సంతృప్తికరంగా లేకపోవడంతో మన్మథుడు 2 వాయిదా పడిందని వార్తలు వచ్చాయి.  తాజాగా ఈ సినిమా గురించిన ఓ అప్డేట్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నది.  మన్మథుడు 2 సినిమా జనవరి నుంచి సెట్స్ మీదకు వెళ్లనుందని వార్తలు అందుతున్నాయి.  మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందొ తెలియాలి.