పోర్చుగీస్ టీమ్ తో మన్మధుడు

పోర్చుగీస్ టీమ్ తో  మన్మధుడు

మన్మధుడు సీక్వెల్ గా వస్తున్న సినిమా మన్మధుడు 2.  ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పోర్చుగల్ లోని అందమైన లొకేషన్స్ లో జరుగుతున్నది.  నాగార్జున హీరోగా చేస్తున్న ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు.  సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  మన్మధుడు సినిమా క్లాసికల్ హిట్ అయ్యింది.  ఆ క్లాసిక్ కు సీక్వెల్ గా మన్మధుడు 2 సినిమా తెరకెక్కుతోంది.  

రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో సమంత క్యామియో రోల్ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే.  ఇదిలా ఉంటె, పోర్చుగల్ లో అక్కడి టిమ్ తో కలిసి మన్మధుడు నాగార్జున ఫోటో దిగి ఆ ఫోటోను సోషల్ మీడియాలో మన్మధుడు డైరీస్ పేరుతో పోస్ట్ చేశారు.  పోర్చుగీస్ లో షూటింగ్ చేయడం చాలా ఆనందంగా ఉందని, మన్మధుడు 2 కు పనిచేసిన పోర్చుగీస్ యూనిట్ కు నాగార్జున థాంక్స్ చెప్తూ ట్విట్టర్ లో ఫోటో షేర్ చేశాడు.  ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.