అఖిల్, నాగ చైతన్యల్లో మన్మథుడు ఎవరు ?

 అఖిల్, నాగ చైతన్యల్లో మన్మథుడు ఎవరు ?

అక్కినేని నాగార్జున చేసిన ప్రయోగాత్మక సినిమాల్లో 'మన్మథుడు' కూడ ఒకటి.  త్రివిక్రమ్ రచన, విజయ భాస్కర్ దర్శకత్వం కలిసి ఈ సినిమాను బ్లాక్ బస్టర్ గా నిలిపాయి.  ఈ సినిమాతో నాగార్జున పేరుకి ముందు మన్మథుడు అనే పదం నిలబడిపోయింది.  

ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందించే ఉద్దేశ్యంలో నాగార్జున ఉన్నట్టు తెలుస్తోంది.  అందుకే తన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై 'మన్మథుడు 2' అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారట.  అయితే ఈ ఈ సీక్వెల్ లో నాగార్జున నటిస్తారా లేకపోతే అఖిల్, నాగ చైతన్యల్లో ఎవరైనా నటిస్తారా అనేది తెలియాల్సి ఉంది.  ప్రస్తుతానికైతే ఈ ముగ్గురు హీరోలు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.