'మన్మథుడు-2' కొత్త పోస్టర్ చూశారా..?

'మన్మథుడు-2' కొత్త పోస్టర్ చూశారా..?

దాదాపు పదిహేడేళ్ల క్రితం అక్కినేని నాగార్జున హీరోగా చేసిన మన్మథుడు క్లాసిక్‌ హిట్‌గా భారీ విజయం సాధించింది. క్లీన్‌ ఎంటర్‌టైనర్‌గా నిలిచిన ఈ సినిమాతో నాగార్జున కెరీర్‌ తిరిగి గాడిలో పడింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా మన్మథుడు-2 ను తెరకెక్కిస్తున్నారు. మ‌నం ఎంట‌ర్‌ప్రైజ‌స్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌య్‌కామ్ 18 స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ ర‌వీంద్రన్ దర్శకుడు. 
నిర్విరామంగా షూటింగ్‌ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను దర్శకుడు రాహుల్‌ ట్వీట్‌ చేశారు. మన్మథుడు 2 టీజర్ ని ఈ నెల 13న మధ్యాహ్నం ఒంటిగంటకు విడుదల చేయనున్నట్టు ఆయన ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే.. ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను కూడా ఆయన పోస్ట్‌ చేశారు. పేకాటలోని కింగ్ కార్డుపై యానిమేటెడ్‌ లుక్‌లో నాగార్జున ఉండేలా డిజైన్‌ చేసిన ఈ పోస్టర్‌ ఆకట్టుకుంటోంది.