సీఎస్ కు వద్దకు శ్రీవారి నగల తరలింపు నివేదిక

సీఎస్ కు వద్దకు శ్రీవారి నగల తరలింపు నివేదిక

శ్రీవారి బంగారు నగల తరలింపు వ్యవహారంపై జరిపిన విచారణ నివేదిక సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం వద్దకు చేరింది. వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన అనంతరం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ ప్రభుత్వ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యానికి నివేదికను అందచేశారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులను మన్మోహన్ సింగ్ విచారించిన అనంతరం మంగళవారం సీఎస్ తో భేటీ అయ్యి నివేదిక సమర్పించారు.