'బాబు పోరాటానికి సహకరిస్తాం'

'బాబు పోరాటానికి సహకరిస్తాం'

విభజన హామీలు అమలు చేయడంలో బీజేపీ విఫలమైందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీలో చేపట్టిన ధర్మపోరాట దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. దీక్ష వేదిక వద్దకు వచ్చి మద్దతు పలికారు. ఈ సందర్భంగా మన్మోహన్‌ మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలూ మద్దతు ఇచ్చాయని గుర్తుచేశారు.  ప్రత్యేక హోదా సాధించుకోవడానికి చంద్రబాబు చేస్తున్న కృషికి అందరం సహకరిస్తామని తెలిపారు. అంతకముందు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా చంద్రబాబును కలిసి దీక్షకు మద్దతు తెలిపారు.