'కాంగ్రెస్‌' సీఎంలతో మన్మోహన్‌ భేటీ..

'కాంగ్రెస్‌' సీఎంలతో మన్మోహన్‌ భేటీ..

నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకానున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులతో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇవాళ ఢిల్లీలో భేటీ అయ్యారు. ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్‌లో జరుగుతున్న ఈ సమావేశంలో.. నీతి ఆయోగ్‌లో ఏ అంశాలపై మాట్లాడాలన్న విషయాలపై సమగ్రంగా చర్చిస్తున్నారు. రాష్ట్రాల అధికారాలపై గట్టిగా వాణి వినిపించాలని కాంగ్రెస్ ముఖ్యమంత్రులకి  మన్మోహన్ సింగ్ దిశా నిర్దేశం చేశారు. రికార్డ్స్ ఆధారంగా బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించాలని మన్మోహన్‌ సూచించారు.