మన్మోహన్‌ ఇక పోటీ చేయరా?

మన్మోహన్‌ ఇక పోటీ చేయరా?

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ రాజ్యసభ సభ్యత్వం పూర్తయింది. ఇన్నాళ్ళూ ఆయన అస్సాం నుంచి ప్రాతినిధ్యం వహించారు. అస్సాం నుంచి తొలిసారి గెలిచిన తరవాత  ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి ద్వారా ఆ ప్రాంతం అభివృద్ధికి విశేషంగా కృషి చేశాయి. అయిదు సార్లు ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. 28 ఏళ్ళ ఆయన రాజకీయ ప్రస్థానం ముగిసిందా లేదా ఆయన మరో రాష్ట్రం నుంచి బరిలోకి దిగుతారా అన్న సస్పెన్స్‌ ఇపుడు కొనసాగుతోంది. అస్సాంలో కాంగ్రెస్‌కు బలం లేదు. జూన్‌ 13వ తేదీతో మన్మోహన్‌ పదవీ కాలం ముగిసింది. మున్ముందు కాంగ్రెస్‌కు మెజారిటీ ఉన్న ఇతర అసెంబ్లీ నుంచి మన్మోహన్‌ సింగ్‌ను బరిలోకి దింపుతారా లేదా ఆయన రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా ఉంటారా అన్న చర్చ ఇపుడు ఢిల్లీలో పొలిటికల్‌ సర్కిల్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. మన్మోహన్‌ ను రాజస్థాన్‌ లేదా మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి బరిలోకి దింపే అవకాశముందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.