30న మనం కలుద్దాం: మోడీ

30న మనం కలుద్దాం: మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ రేడియో కార్యక్రమం 'మన్‌ కీ బాత్‌' ఈ నెల 30వ తేదీన మళ్లీ ప్రారంభంకానుంది. ఈ విషయాన్ని నరేంద్ర మోడీ తన ట్వీట్టర్‌ ద్వారా తెలిపారు. 'జూన్ 30న ఆదివారం 11 గంటలకు మనం మళ్లీ కలుస్తున్నాం. 130 కోట్ల మంది భారతీయుల సంతోషాన్ని పంచుకునేందుకు అవకాశం కల్పించిన రేడియోకి కృతజ్ఞతలు' అని ఆయన పోస్ట్‌ చేశారు. రాబోయే మన్‌ కీ బాత్ కార్యక్రమాల్లో ఏయే అంశాలపై చర్చించాలనే విషయంపై 'నమో' యాప్‌ ద్వారా తెలియజేయాలని ఆయన కోరారు. టోల్ ఫ్రీ నంబర్ 1800-11-7800కి ఫోన్ చేసి తమ సందేశాన్ని రికార్డు చేయోచ్చన్నారు. 'మైగౌ' ఓపెన్ ఫోరమ్‌లో కూడా అభిప్రాయాలను పంచుకోవచ్చని అన్నారు.