అవకాశం ఉన్న నాకు ఇవ్వలేదు : మనోజ్‌ తివారి

అవకాశం ఉన్న నాకు ఇవ్వలేదు : మనోజ్‌ తివారి

భారత క్రికెటర్ మనోజ్‌ తివారి 2008 లో ఆస్ట్రేలియాకు వ్యతిరేకంగా భారత జట్టులోకి వచ్చాడు. ఇప్పటికి అతని 12 సంవత్సరాల అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ లో 12 వన్డే మ్యాచ్ లు, 3 టీ 20 లో భారత్ కు ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఈ ఆటగాడు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో బీసీసీఐ పై కొన్ని ఆరోపణలు చేసాడు. భారత జట్టులో అవకాశం ఉన్న నాకు ఇవ్వలేదు అని చెప్పాడు. అసలు ఏం జరిగిందంటే... భారత్-వెస్టిండీస్ మధ్య 2011 ఐదు మ్యాచ్ ల వన్డే సిరీస్ జరిగింది. అందులో చివరి మ్యాచ్ లో  తివారి 104 తో రాణించడంతో భారత జట్టు విజయం సాధించింది. ఆ తర్వాత మళ్ళీ ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో మాత్రం తివారికి చోటు దక్కలేదు. ఈ విషయం పై మాట్లాడుతూ... మేము ఆస్ట్రేలియా ఉన్నప్పుడు భారత మిడిల్‌ ఆర్డర్‌ పరుగులు చేయలేకపోయింది. అంతేకాకుండా మిడిల్‌ ఆర్డర్‌లో బ్యాట్స్‌మన్‌కు ఛాన్స్ ఉంది. ఆ అవకాశం నాకు వస్తుంది అనుకున్న కానీ రాలేదు. గత మ్యాచ్ లో సెంచరీతో జట్టును గెలిపించే ప్రదర్శన చేశాక ఎవరికైనా సరే జట్టులో తన స్థానం వస్తుంది అనే అనుకుంటారు. కానీ నన్ను బీసీసీఐ తర్వాతి 14 మ్యాచ్‌ల పాటు బెంచ్‌కే పరిమితం చేయడం షాక్‌ అనిపించింది అన్నాడు.