కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

సవరించిన అంచనా ప్రకారం నైరుతి రుతుపవనాలు ఇవాళ కేరళ తీరాన్ని తాకాయి. భారత వాతావరణ విభాగం ఈ విషయాన్ని వెల్లడించింది. వాస్తవానికి ఈనెల 6వ తేదీనే రుతుపవనాలు మన దేశంలో ప్రవేశించాల్సింది. రెండు రోజులు ఆలస్యంగా ఇవాళ కేరళను తాకాయి. 8వ తేదీకల్లా కేరళ రాష్ట్రమంతటా రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ విభాగం తెలిపింది. 

ఇప్పటికే కేరళలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ మహాపాత్ర వెల్లడించారు. నెలాఖరుకల్లా దేశమంతటా విస్తరించి ఢిల్లీకి చేరుకుంటాయని ఆయన తెలిపారు.