ఐసీసీ సీఈవోగా మను సాహ్ని

ఐసీసీ సీఈవోగా మను సాహ్ని

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో)గా ఈఎస్‌పీఎస్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మను సాహ్ని నియమితులయ్యారు. మనును సీఈవోగా ఐసీసీ అపెక్స్‌ కమిటీ చైర్మన్‌ శశాంక్‌ మనోహర్, నామినేషన్స్‌ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఇంగ్లండ్‌లో జరుగనున్న వన్డే ప్రపంచ కప్‌తో ప్రస్తుత సీఈవో రిచర్డ్సన్‌ పదవీకాలం ముగుస్తుంది. అనంతరం జూలైలో రిచర్డ్సన్‌ స్థానంలో సీఈవోగా మను సాహ్ని బాధ్యతలు స్వీకరించనున్నారు. సింగపూర్‌ స్పో ర్ట్స్‌ హబ్‌కు సీఈవోగా, ఈఎస్‌పీఎస్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా మను గతంలో పనిచేశారు.