చరణ్ సినిమాలో బోలెడంత మంది విదేశీయులు !

చరణ్ సినిమాలో బోలెడంత మంది విదేశీయులు !

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బోయపాటి శ్రీనుల సినిమాపై ఏ స్థాయి అంచనాలున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.  మాస్ హీరో చరణ్, యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి మొదటిసారి కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ నుండి చాలానే ఆశిస్తూ, తమ హీరోను బోయపాటి ఎలాంటి స్టైల్లో ప్రెజెంట్ చేస్తారో చూడాలని ఆశగా ఉన్నారు మెగా అభిమానులు.

వాళ్ళ అంచనాలను అందుకునేలా బోయపాటి హెవీ యాక్షన్ సన్నివేశాలతో సినిమాను నింపేస్తున్నారు. అందుకోసం అజర్బైజాన్ షెడ్యూల్లో షూట్ చేసిన పోరాట సన్నివేశాల్లో చాలా మంది విదేశీ ఫైటర్లను తీసుకున్నారు.  వారి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ హడావుడి చేస్తున్నాయి.  దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో కైరా అద్వానీ కథానాయకిగా నటిస్తోంది.