క్రేజ్ తగ్గని కెమెరా

క్రేజ్ తగ్గని కెమెరా

కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లు మార్కెట్ ను ముంచెస్తున్న ఈ అధునాతన కాలంలో కూడా కెమెరాకు క్రేజీ తగ్గటం లేదు. విక్రయాల్లో స్మార్ట్ ఫోన్లతో పోటీ పడుతున్నాయి. కొంచె అటూ ఇటూగా అమ్మకాలు జరుగుతున్నాయి. అద్భుతమైన చిత్రాలను సైతం ఇట్టే పట్టేసేదే కెమెరా. స్మార్ట్ పోన్ కెమెరాతో తీసిన ఫోటోలకు, కెమెరాతో తీసిన ఫోటోలకు చాలా తేడా ఉంటుంది. సెల్ఫీ తీసుకున్న ఫోటోల కంటే.. కెమెరాలో ఫోటో తీసుకుంటే ఆ క్లారిటే వేరు. అందుకే స్మార్ట్ ఫోన్ ల యుగంలో కూడా కెమెరాకు క్రేజీ తగ్గలేదంటే అతిశయోక్తి కాదు.

స్మార్ట్ ఫోన్ లాగే ఇప్పుడు కెమెరా కూడా కొత్త కొత్త మోడల్స్ లో దొరుకుతున్నాయి. స్మార్ట్ ఫోన్ కంటే ఆధునిక టెక్నాలజీలో కూడా లభిస్తోంది. స్మార్ట్ ఫోన్ లతో రోజు కోట్ల ఫోటోలు క్లిక్ మనిపిస్తున్నా కెమెరా క్రేజీ మాత్రం తగ్గటం లేదు. రోజు రోజుకు కెమెరా ప్రియులు పెరిగిపోతున్నారు. ఈ తరానికి తగ్గట్టుగా అధునికంగా, హై క్వాలిటీ ఇమేజ్ లు, క్వాలిటీ డివైజస్ లాంటివి మార్కెట్ లోకి వస్తున్నాయి. నికాన్, కెనాన్, సోనీ లాంటి కంపెనీలు అధునాతన కెమెరాలను స్మార్ట్ ఫోన్ లకు సైతం అమర్చుతున్నాయి. ఇప్పుడు అలాంటి కెమెరాలతో వినియోగదారులు పెళ్లి ఫోటోలను అద్భుతంగా తీస్తున్నారు. ఇక ప్రకృతి ప్రేమికులు సంగతి సరేసరి. మంచి సీనరీలను ఇట్టే పట్టేస్తున్నారు. ఎంతో ఆధునాతన కెమెరాలున్న స్మార్ట్ ఫోన్ వచ్చిన కెమెరా మార్కెట్ పడిపోలేదు. స్మార్ట్ ఫోన్ కు పోటీగా కెమెరా మార్కెట్ కూడా నడుస్తోంది. 2013-14 సంవత్సరంలో 81 మిలియన్ స్మార్ట్  ఫోన్లు అమ్ముడు కాగా.. 2017-18 సంవత్సరానికి ఆ సంఖ్య 123 మిలియన్లు కు పెరిగింది.

అయితే.. కెమెరాల విషయానికి వస్తే 2013-14 సంవత్సరంలో 3.5 లక్షల యూనిట్స్ విక్రయించగా.. 2017-18 సంవత్సరంలో ఆ సంఖ్య 5 లక్షల యూనిట్స్ కు పెరిగింది. దీంతో కెమెరా మార్కెట్ కూడా తగ్గలేదని లెక్కలే చెబుతున్నాయి. డీఎస్ఎల్ఆర్ లాంటి అధునాతన సౌకర్యాలున్న కెమెరాల కోసం వినియోగదారులు రేటు ఎక్కువ పెట్టేందుకు వెనుకాడటం లేదు. వీటికి తోడు రకరకాల టెక్నికల్ ఆప్షన్స్. తాజాగా కెమెరాకు వై ఫై కనెక్షన్ ఆఫ్షన్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. కెమెరాను స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేసి తీసిన ఫోటోలను సోషియల్ మీడియాలో అప్ లోడ్ చేసుకోవచ్చు. అంతే కాకుండా ఫోటోను ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇన్ని సౌకర్యాలు ఉండటంతోనే రకరకాల స్మార్ట్ ఫోన్ లు వచ్చినా కెమెరా క్రేజీ తగ్గటం లేదు.