లోంగిపోయిన మావోయిస్టు దళ సభ్యుడు

లోంగిపోయిన మావోయిస్టు దళ సభ్యుడు

నిషేదిత మావోయిస్టు పార్టీ దళ సభ్యుడు ఇరెల్లి నాగరాజు ఆలియాస్‌ శివ వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డా. వి. వి. రవీందర్‌ ఎదుట లొంగిపోయాడు. జనగామ జిల్లా జఫర్‌ఘడ్‌ మండలం తీగారం గ్రామానికి చెందిన ఇరెల్లి నాగరాజు 2018 జనవరి మాసంలో మావోయిస్టు పార్టీలో దళ సభ్యుడుగా చేరాడు. మావోయిస్టు పార్టీలో 14 నెలల కాలం పనిచేసిన నాగరాజు.. దళ సభ్యుడుగా తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ కార్యదర్శి యాపనారయణ ఆలియాస్‌ హరిభూషన్‌ మరియు తెలంగాణ రాష్ట్ర మిలటరీ ఇంచార్జీ బడేచోక్కరావు ఆలియాస్‌ దామోదర్‌ వద్ద పనిచేసాడు. గత కోద్ది రోజులుగా నాగరాజుకు మావోయిస్టు పార్టీ సిద్దాంతాలు నచ్చకపోవడంతో.. శుక్రవారం పోలీసుల ఎదుట లొంగిపోయాడు.