ఏవోబీలో మావోయిస్టుల దుశ్చర్య..

ఏవోబీలో మావోయిస్టుల దుశ్చర్య..

ఆంధ్రప్రదేశ్‌-ఒడిశా సరిహద్దులో మరోసారి మావోయిస్టులు అలజడి సృష్టించారు... ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో దుశ్చర్యకు పాల్పడ్డారు. మల్కన్‌గిరి జిల్లా మత్తిలి పరిధిలోని తేమురుపల్లి పంచాయతీ కార్యాలయాన్ని పేల్చివేశారు మావోయిస్టులు. ఈ ఘటనలో పంచాయతీ కార్యాలయం గోడలు పడిపోగా... కార్యాలయంలోని ఫర్నీచర్, బీరువాలు చెల్లాచెదరయ్యాయి. కొంత సామగ్రి కాలిబూడిదైంది. మరోవైపు అలర్ట్ అయిన ఆంధ్ర-ఒడిశా పోలీసులు.. మావోయిస్టుల కోసం ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టుల జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.