టీఆర్ఎస్ నేత దారుణ హత్య..

టీఆర్ఎస్ నేత దారుణ హత్య..

టీఆర్ఎస్ నేత, చర్ల మాజీ ఎంపీటీసీ శ్రీనివాసరావును దారుణంగా హత్యచేశారు మావోయిస్టులు... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లకు చెందిన మాజీ ఎంపీటీసీ నల్లాల శ్రీనివాసరావును ఈ నెల 8వ తేదీన కిడ్నాప్ చేశారు మావోయిస్టులు. పోలీసు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరించినందునే శ్రీనివాసరావును హత్యచేసినట్టు మావోయిస్టులు పేర్కొన్నారు. ఎర్రంపాడు, పొట్టిపాడు గ్రామాల మధ్య శ్రీనివాసరావు మృతదేహం లభ్యమైంది. శ్రీనివాసరావు మృతదేహం వద్ద చర్ల ఏరియా కమిటీ కార్యదర్శి శారద పేరుతో లేఖ దొరికింది. ఆదివాసీ ప్రజాసంఘాల పేరుతో తమపై దుష్ప్రచారం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఇక, 8వ తేదీన కిడ్నాప్‌నకు గురైన శ్రీనివాసరావు ఆచూకీ తెలుసుకోవడానికి ఏజెన్సీ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు పోలీసులు.. శ్రీనివాసరావు ఎవరికీ అపకారం చేసే వ్యక్తి కాదు.. క్షేమంగా విడిచిపెట్టాలంటూ కుటుంబసభ్యులు వేడుకున్నారు. కాగా, ఇవాళ శ్రీనివాసరావు మృతదేహం లభ్యమైంది.