అంపైర్‌ ఎరాస్ముస్‌ 'హాఫ్‌ సెంచరీ'

అంపైర్‌ ఎరాస్ముస్‌ 'హాఫ్‌ సెంచరీ'

అంపైర్‌ ఆఫ్‌ సెంచరీ చేయడం ఏంటి అనుకుంటున్నారా?. మరేంలేదు.. లార్డ్స్‌ వేదికగా భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య మొదలైన రెండో టెస్ట్‌ మ్యాచ్  దక్షిణాఫ్రికాకు చెందిన అంపైర్‌ మరైస్‌ ఎరాస్ముస్‌కు 50వ టెస్ట్‌ మ్యాచ్. ఎరాస్ముస్‌ తన కెరీర్‌లో 50 టెస్టులకు అంపైర్‌గా చేసాడు. దీంతో ఈ ఘనతను అందుకున్న 17వ అంపైర్‌గా రికార్డులోకి ఎక్కాడు. ఈ జాబితాలో స్టీవ్‌బక్‌నర్‌ 128 టెస్టులతో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే ఎరాస్ముస్‌ దక్షిణాఫ్రికా నుండి రెండవ వారు. రూడీ కోర్ట్‌జెన్‌ 108 టెస్టులతో మొదటి స్థానంలో ఉన్నాడు. 2010లో బంగ్లాదేశ్‌, భారత్‌ జట్ల మధ్య చిట్టగాంగ్‌ వేదికగా జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో ఎరాస్ముస్‌ తొలిసారి ఎంపరింగ్ చేశారు.

ఎరాస్ముస్‌ మాట్లాడుతూ... ఈ రోజు ఎంతో ప్రత్యేకమని.. మరిచిపోలేని రోజని తెలిపారు. ఈ ఘనతను సాధించినందుకు సంతోషంగా ఉందని.. తన విజయానికి తన కుంటు సభ్యులే కారణమని తెలిపారు. కెరీర్ లో మద్దతుగా నిలిచిన ఐసీసీ, దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డుకు ధన్యవాదాలు తెలిపారు. 50వ టెస్ట్‌ సందర్భంగా మ్యాచ్ నిర్వాకులు లార్డ్స్‌ మైదానంలో బహుమతిని అందజేశారు.