రహదారులను స్తంభింపచేసిన మరాఠాలు

రహదారులను స్తంభింపచేసిన మరాఠాలు

విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న మరాఠా నిరసనకారులు రాష్ట్రంలోని పలు రహదారులను దిగ్భందించారు. శాంతియుత బంద్ చేపట్టాలని మరాఠా వర్గ నేతలు పిలుపునిచ్చినా నిరసనకారులు రహదారులను దిగ్భందించారు. పుణె- హైదరాబాద్ జాతీయ రహదారి సహా పలు రహదారుల్లో రాకపోకలను స్తంభింపచేశారు. కొన్ని ప్రాంతాల్లో టైర్లకు నిప్పు పెట్టారు. ఔరంగాబాద్ జిల్లాలో క్రాంతి చౌక్ వద్ద కొంత మంది శివసేన అధిపతి ఉద్దవ్ ఠాక్రే కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది.