మార్చి 30, 2020 సోమవారం దినఫలాలు

మార్చి 30, 2020 సోమవారం దినఫలాలు

మేషం

చేపట్టేపనుల్లో శ్రమపెరగకుండా చూసుకోవాలి. ఆర్ధిక విషయాల్లో పొదుపు సూత్రాన్ని పాటించాలి.  కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు.  ఆపదలు తొలగడానికై  వెంకటేశ్వరుణ్ణి  పూజించాలి.

వృషభం

చేపట్టిన పనులలో ఆటంకములు ఎదురైనా అధిగమించే ప్రయత్నము చేస్తారు. అవసరానికి తగిన సహకారం అందుకుంది . మనస్సౌఖ్యం ఉంది .  శివుడిని ఆరాధిస్తే మంచిది.
 
మిథునం

మీమీ రంగాల్లో శ్రమ పెరుగుతుంది.  ఒక వ్యవహారములో మీరు మాటపడవలసి వస్తుంది. సహనం కోల్పోరాదు. నిదానంగా అన్ని సర్దుకుంటాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి.   లక్ష్మి సహస్రనామ పారాయణ చేస్తే  బాగుంటుంది.

కర్కాటకం

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు.    మీరు ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పని దాదాపుగా పూర్తి కావస్తుంది.  మహాలక్ష్మి అష్టోత్తరము చదివితే మంచిది.

సింహం

శుభకాలం. మీమీ రంగాల్లో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి.  ముఖ్య పనులను మొదలుపెట్టడానికి  ఇది  సరైన సమయం. కొన్ని పరిస్థితులు మానసిక  సంత్రుప్తిని కలిగిస్తాయి. లక్ష్మి దేవి సందర్శనం వలన శుభ ఫలితములు కలుగుతాయి.

కన్య

వ్రుత్తి ఉద్యోగ వ్యాపారములలో అబివ్రుద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.    విందు వినోద కార్యక్రమములలో పాల్గొంటారు. ఈశ్వర  సందర్శనం ఉత్తమం.

తుల

చేపట్టిన పనులలో సానుకూల ఫలితములు లభిస్తాయి.      విందు వినోద కార్యక్రమములలో పాల్గొంటారు.  నూతన వస్తువులు కొంటారు.   అధికారులు  మీ అభివృద్దికి దోహదపడే ఒక కీలక నిర్ణయమును తీసుకుంటారు.  ఇష్టదైవారాధన మేలుచేస్తుంది.

వృశ్చికం

అనుకూలమైన సమయం.   వృత్తి ఉద్యోగ వ్యాపారములలో ప్రోత్సాహకరమైన వాతావరణము ఉంటుంది. ఎలాంటి పరిస్థితులలోనూ మనోధైర్యమును కోల్పోరు. ఆర్ధికంగా లాభదాయకమైన ఫలితాలు వస్తాయి. దైవారాధన మానవద్దు.

ధనుస్సు

ప్రతిపనీ బాగా అలోచించి చేయండి . సమయానికి సహాయం చేసేవారున్నారు. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. లక్ష్మి ధ్యానం చేయాలి.

మకరం

అనుకున్నది సాధిస్తారు. బంధుమిత్రులతో ఆనందంగాగడుపుతారు. కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది.     గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఇస్టులతో కాలాన్ని గడుపుతారు.  ఇష్టదైవ ప్రార్థన వల్ల మేలు జరుగుతుంది.

కుంభం

ధనలాభం కలదు.  వ్యాపారంలో ఆర్ధిక అభివృద్ధిని అందుకుంటారు.  విందు వినోదాల్లో సంతోషంగా గడుపుతారు.  నూతన కార్యాలు ప్రారంభించే ముందు సాధ్యసాధ్యాలను దృష్టిలో పెట్టుకొవాలి.  దుర్గ ఆరాధన చేయాలి.

మీనం

ఒక వ్యవహారములో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది.  ఒక వ్యవహారములో మీ పనితీరును అధికారులు మెచ్చుకుంటారు. బంధువులతో అనుకూలత ఉంది. హనుమాన్ చాలీసా పఠించడం వలన మంచి ఫలితములు పొందగలుగుతారు.