ఈ ముగింపు ఎలా ఉంటుందో...

ఈ ముగింపు ఎలా ఉంటుందో...

మార్చి నెల వచ్చింది అనుకుంటే అప్పుడే సగం రోజులు కూడా పూర్తయ్యాయి.  మరో రెండు వారాల్లో మార్చి వెళ్ళిపోబోతున్నది.  ఈ పదిహేను రోజుల్లో చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.  గత శుక్రవారం రిలీజైన సినిమాల్లో ఒక్కటి కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.  కొన్ని బాగున్నాయని టాక్ వచ్చినా.. సరైన ప్రమోషన్స్ లేక రేస్ లో వెనకబడ్డాయి.  వచ్చేవారం చాలా సినిమాలు రిలీజ్ సిద్ధంగా ఉన్నాయి.  ఇందులో ముందుగా చెప్పుకోవలసింది చీకటిగదిలో చితక్కొట్టుడు సినిమా గురించే.  పక్కా అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ మసాలా సినిమాలో బూతు తప్ప మరొకటి కనిపించదు.  

ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు ఈ సినిమాకు వెళ్లేందుకు ఆసక్తి చూపించరు.  యూత్ మాత్రమే ఈ సినిమాకు ఎట్రాక్ట్ అవుతుంది. హిట్టయ్యే ఛాన్స్ లేకపోయినా పెట్టిన డబ్బులు వెనక్కి రావడం ఖాయం.  అదే రోజున అంటే మార్చి 21 వ తేదీన సువర్ణ సుందరి అనే సినిమా రిలీజ్ సిద్ధమా ఉంది.  సాక్షి చౌదరి, జయప్రద వంటి తారలు నటించిన ఈ సినిమాలో కళ్ళు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయని అంటున్నారు.  ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు.  

మార్చి 22 చాలా కీలకమైన రోజు.  ఆరోజున లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాను రిలీజ్ చేయకుండా ఆపేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు.  ఒకవేళ రిలీజ్ కాకుండా అడ్డుకుంటే సినిమాను యూట్యూబ్ లో ఫ్రీగా చూసే విధంగా అప్లోడ్ చేస్తారట.  ఆ తరువాత మార్చి 29 న నిహారిక సూర్యకాంతం, నిఖిల్ అర్జున్ సురవరం వంటి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.  ఈ రెండు వారాల్లో రిలీజ్ కాబోయే సినిమాల్లో ఏ సినిమా హిట్ అవుతుందో.. ఏది ఫట్ అవుతుందో తెలియాలంటే మరో రెండు వారాలు ఆగాల్సిందే.