ఐపీఎల్ 2020 : రెచ్చిపోయిన స్టోయినిస్.. పంజాబ్ లక్ష్యం ఎంతంటే..?

ఐపీఎల్ 2020 : రెచ్చిపోయిన స్టోయినిస్.. పంజాబ్ లక్ష్యం ఎంతంటే..?

ఈ ఏడాది ఐపీఎల్ లో దుబాయ్ వేదికగా ఈ రోజు కింగ్స్ ఎలెవన్ పంజాబ్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య రెండో మ్యాచ్ జరుగుతుంది. అందులో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే అనుకున్న విధంగానే ఢిల్లీ బ్యాట్స్మెన్స్ ను కట్టడి చేసిన పంజాబ్ జట్టుకు చివర్లో మార్కస్ స్టోయినిస్ షాక్ ఇచ్చాడు. క్రిస్ జోర్డాన్ వేసిన చివరి ఓవర్లో మాత్రం స్టోయినిస్ రెండు సిక్స్లు మూడు ఫోర్లతో రెచ్చిపోయాడు. దాంతో కేవలం 21 బంతుల్లోనే 53 పరుగులు చేసాడు. అసలు మొదట కనీసం ఢిల్లీ 100 పరుగులైన చేస్తుందా అనే అనుమానం ఉన్న సమయంలో వచ్చిన స్టోయినిస్ రెచ్చిపోవడంతో ఆ జట్టు  8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఇక పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు, షెల్డన్ కాట్రెల్ 2 వికెట్లు, రవి బిష్ణోయ్ ఒక వికెట్ సాధించారు. అయితే ఈ మ్యాచ్ లో పంజాబ్ గెలవాలంటే 158 పరుగులు చేయాలి. చూడాలి మరి ఎవరు విజయం సాధిస్తారు అనేది.