వింబుల్డన్‌ నుంచి సిలిచ్‌ అవుట్

వింబుల్డన్‌ నుంచి సిలిచ్‌ అవుట్

క్రొయేషియా స్టార్‌ ప్లేయర్ మారిన్‌ సిలిచ్‌ వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ నుండి నిష్క్రమించాడు. వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ రెండో రౌండ్ లో సిలిచ్‌ ఓటమిపాలయ్యాడు. మూడో సీడ్‌ సిలిచ్ 6–3, 6–1, 4–6, 6–7 (3/7), 5–7తో గుయిడో పెల్లా(అర్జెంటీనా) చేతిలో కంగుతిన్నాడు. 3 గంటల 13 నిమిషాల పాటు జరిగిన హోరా  హోరి పోరులో సిలిచ్‌కు ముచ్చెమటలు పట్టిస్తూ పెల్లా విజయం సాధించాడు. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో నాదల్, జొకోవిచ్‌లు అలవోకగా విజయం సాదించాడు. మహిళల సింగిల్స్‌లో హలెప్, ఎంజెలిక్‌ కెర్బర్‌ మూడో రౌండ్లోకి ప్రవేశించారు.