ట్విట్టర్ లా మేము చేయం : ఫేస్ బుక్

ట్విట్టర్ లా మేము చేయం : ఫేస్ బుక్

ప్రపంచవ్యాప్తంగా ట్విటర్‌ లో ఇప్పటిదాకా ఉన్న పొలిటికల్ పబ్లిసిటీ ఆప్షన్ ని నిలిపివేయనున్నట్లు ఆ సంస్థ సీఈవో జాక్‌ డోర్సే తేల్చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం ఈ నెల 22 నుంచి అమల్లోకి రానుంది. పొలిటికల్ మెసేజ్ లు వైరల్‌ అవుతూ ప్రజల వద్దకు చేరాలి కానీ, డబ్బు చెల్లించి వాటిని వారివద్దకు చేర్చకూడదని అభిప్రాయపడ్డారు. డబ్బు కోసం ఈ విషయంలో రాజీపడేది లేదని ఆయన తేల్చేశారు. ఈ క్రమంలో ఫేస్ బుక్ కీలక ప్రకటన చేసింది. రాజకీయ ప్రకటనలను తాము నిషేధించబోమని ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ ప్రకటించారు. రాజకీయ ప్రకటనలు ఆయా అభ్యర్థుల మనోగతాన్ని వినిపించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇలాంటి ప్రకటనలను వేయాలా? వద్దా అని గతంలో ఆలోచించాం. ప్రజాస్వామ్యం ఉన్న చోట రాజకీయ నాయకులను గానీ వార్తలనుగానీ సెన్సార్‌ చేసే హక్కు ప్రైవేటు కంపెనీలకు ఉందని తను భావించడం లేదన్న ఆయన ఇక ముందు రాజకీయ ప్రకటనలను కొనసాగిస్తామని మార్క్‌ జుకర్‌బర్గ్‌ పేర్కొన్నారు. అంతేకాక రాజకీయ ప్రకటనలను గూగుల్‌, యూట్యూబ్‌ సహా కేబుల్‌ నెట్‌వర్క్‌లు, జాతీయ ఛానెళ్లు ప్రసారం చేస్తున్నాయని గుర్తు చేశారు. ఆదాయం వస్తుందని రాజకీయ ప్రకటనలను ఫేస్ బుక్ అలో చేస్తుందని క్రిటిక్స్ చేస్తున్న విమర్సల మీద స్పందించిన ఆయన తమకు వచ్చే ఆదాయంలో ఈ యాడ్స్ ద్వారా .5 శాతం కూడా రాదనీ అలాంటి దాని కోసం తాము ఈ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.