అన్నీ సూచీలు నష్టాల్లోనే....

అన్నీ సూచీలు నష్టాల్లోనే....

మార్కెట్‌కు ఏ స్థాయిలోనూ మద్దతు అందకపోవడంతో స్టాక్‌ మార్కెట్‌ ఒక మోస్తరు నష్టాలతో ముగిసింది. ప్రతి రెండు షేర్లకు మూడు షేర్లు నష్టాల్లో క్లోజయ్యాయి. ముఖ్యంగా మిడ్‌ క్యాప్‌ షేర్లు భారీగా నష్టపోయాయి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లలో కొనుగోళ్ళు కొనసాగాయి. హాంగ్‌సెంగ్‌ ఒకశాతంపైగా నష్టపోయినా ఇతర సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. మిడ్‌ షెషన్‌లో మొదలైన యూరో మార్కెట్లు లాభాల్లో ఉన్నా మన మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టి 61 పాయింట్ల నష్టంతో 10618 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ కూడా 188 పాయింట్లు నష్టపోయింది. హెక్సావేర్‌ టెక్నాలజీస్‌, ఎన్‌ఐఐటీ టెక్‌, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, క్యాస్ట్రాల్‌,  డెల్టా కార్ప్‌, టాటా ఎలెక్సి షేర్లు 13 శాతం వరకు క్షీణించాయి. వరుణ్‌ బేవరేజస్‌, గృహ్‌ ఫైనాన్స్‌, ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌, గ్రోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా,  జస్ట్‌ డయల్‌ షేర్లు సుమారు 15 శాతం వరకు లాభపడ్డాయి. ఇక నిఫ్టి ప్రధాన షేర్లలో అదానీ పోర్ట్స్, గెయిల్‌ రెండు శాతం పైగా లాభపడగా, సన్‌ ఫార్మా 3.5శాతం క్షీణించింది.  ఐటీసీ, బజాజ్‌, వేదాంత, ఎస్‌ బ్యాంక్‌ రెండు శాతంపైగా నష్టపోయాయి.