న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన స్టాక్ మార్కెట్‌

న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన స్టాక్ మార్కెట్‌

అంత‌ర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా మ‌న మార్కెట్లు కూడా న‌ష్టాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి. రాత్రి అమెరికా మార్కెట్లు న‌ష్టాల‌తో ముగిశాయి. అమెరికా కేంద్ర బ్యాంకు వ‌డ్డీ రేట్లను మార్చలేదు. వ‌డ్డీ రేట్లను త‌గ్గించాల‌ని అధ్య‌క్షుడు ట్రంప్ చేసిన విజ్ఞప్తిని ఫెడ‌ర‌ల్ రిజ‌ర్వ్ ప‌ట్టించుకోలేదు. ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. చైనా, జ‌పాన్ మార్కెట్లకు సెల‌వు. హాంగ్‌సెంగ్ అర‌శాతం లాభంతో ట్రేడ‌వుతోంది. మ‌న మార్కెట్లలో ఫైనాన్షియ‌ల్ రంగానికి చెందిన షేర్లలో భారీ అమ్మ‌కాల ఒత్తిడి వ‌స్తోంది. అలాగే ఆటో రంగ షేర్ల‌పై కూడా ఒత్తిడి బాగా పెరుగుతోంది. మున్ముందు గ‌డ్డు రోజులు ఉన్నాయ‌ని... కేవ‌లం ఒక్క ఐటీ, బీమా రంగాలు త‌ప్ప మిగిలిన రంగాల షేర్లను మార్కెట్ విశ్లేషకులు రెక‌మెండ్ చేయ‌డంలేదు. నిఫ్టి 11,725 వ‌ద్ద ప్రారంభ‌మై...11,727 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. నిఫ్టి ప్రధాన షేర్లలో ఇన్‌ఫ్రాటెల్‌, ఎస్ బ్యాంక్‌, హీరో మోటోకార్ప్‌, భార‌తీ ఎయిర్‌టెల్‌, ఇండియా బుల్స్ హౌసింగ్ టాప్ గెయిన‌ర్స్‌గా ఉన్నాయి. ఇక టాప్ లూజ‌ర్స్‌గా ఉన్న షేర్లు... టాటా మోటార్స్‌, హిందాల్కో, ఐష‌ర్ మోటార్స్‌, మారుతీ, ఐసీఐసీఐ బ్యాంక్ ఉన్నాయి. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్‌గెయిన‌ర్స్‌... టాటా స్టీల్ (పీపీ), డీసీఎం శ్రీ‌రామ్‌, ఆర్ కామ్‌, బాంబే డైయింగ్‌, జెన్సర్ టెక్నాల‌జీస్‌.
టాప్ లూజ‌ర్స్‌... జెట్ ఎయిర్‌వేస్‌, ఆర్ ప‌వ‌ర్‌, ఎస్కార్ట్స్‌, టీవీఎస్ మోటార్స్‌, ఐఎఫ్‌సీఐ